హైదరాబాద్ లాలాగూడలోని సూపర్ స్టార్ హోటల్‌లో బిర్యానీ డబ్బులు అడిగినందుకు హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. రాడ్డుతో హోటల్ సిబ్బందిపై దాడి చేసి.. ఫర్నీచర్ ధ్వంసం చేశాడు దుండగుడు. ఒక వెయిటర్ తల పగలకొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దుండగుడిని రౌడీ షీటర్ సలీంగా గుర్తించారు. రోజూ తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు.. ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నట్లు హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు.