BRS Party Merge News: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ బీఆర్ఎస్ పార్టీని పొరుగు రాష్ట్రాలకు విస్తరించారు గులాబీ బాస్ కేసీఆర్. అందులోనూ.. మహారాష్ట్రపై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి.. సీనియర్ నాయకులకు చేర్చుకుని కేడర్‌ను కూడా బాగానే కూడగట్టారు. కానీ.. ఇప్పుడు ఆ మరాట్వాడ బీఆర్ఎస్ నాయకులు.. గులాబీ బాస్‌కు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.