సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ వ్యవహారశైలిపై పోలీసుల అధికారుల సంఘం నేత విష్ణుమూర్తి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పోలీసులదే తప్పు అన్నట్లుగా అల్లు అర్జున్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక సెలబ్రెటీగా అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనవసరంగా పోలీసులపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.