కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీలోకి చిరంజీవిని ఆహ్వానిస్తే వస్తారని ప్రకటించారు. కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో తదుపరి అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసని.. ఎద్దేవా చేస్తూ, బీజేపీలో ఆంతరంగిక నియమాలు ఉంటాయన్నారు. తెలంగాణలో టెక్స్‌టైల్ ప్రాజెక్ట్, పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అభివృద్ధి బీజేపీ వల్లే వచ్చాయని కిషన్‌రెడ్డి చెప్పుకున్నారు. హైదరాబాద్ మెట్రో నెక్స్ట్ ఫేజ్‌కు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నా.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉత్కంఠను రేపాయి.