బుక్ చేసినా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాలేదా..? ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి

1 week ago 3
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల అక్రమ మళ్లింపుపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గత నెలలో రూ. 1.5 కోట్ల విలువైన సిలిండర్లను సీజ్ చేసి.. 2,089 కేసులు నమోదు చేసింది. గ్యాస్ సిలిండర్ డెలివరీలో జాప్యం జరిగినా.. డెలివరీ బాయ్స్ అక్రమాలకు పాల్పిడినట్లు తెలిసినా.. 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిత్యం బుకింగ్‌లను పర్యవేక్షిస్తూ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Read Entire Article