హైదరాబాద్ పాతబస్తీలో బురఖా ధరించి బైక్‌పై విన్యాసాలు చేసిన యువకుడిపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని రోడ్లపై ఇద్దరు యువకులు బురఖా ధరించి విన్యాసాలు చేస్తూ.. ప్రమాదకరంగా డ్రైవింగ్ స్టంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను అరెస్టు చేశారు.