బుర్ఖా ధరించి.. లేడీస్ బాత్రూమ్‌లోకి వెళ్లిన పురుషుడు..! కట్ చేస్తే అతడితో పాటు ఓ మహిళ కూడా..

6 months ago 4
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బుర్ఖా ధరించి లేడీస్ బాత్రూమ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ఘటన కలకలం సృష్టించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమానాస్పదంగా కదులుతున్న వారిద్దరిని పట్టుకున్నారు. వారిలో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ అని తెలిసింది. ఈ పరిణామంతో విద్యార్థినులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన దొంగతనమా? లేక మరేదైనా ఉద్దేశ్యమా? అనే అనుమానాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూనే.. పట్టుబడ్డ వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. భద్రతా లోపాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article