బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు సీరియస్.. 11 మంది సెలబ్రటీలపై కేసులు

1 month ago 2
11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీచేసి విచారించనున్నారు. అనంతరం వారి వాంగ్మూలాన్ని బట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Read Entire Article