బోనాలు వాయిదా.. కీలక ప్రకటన చేసిన దేవాదాయ శాఖ మంత్రి..

8 months ago 11
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొందరి అభ్యంతరాలు, తప్పుడు ప్రచారం దీనికి కారణంగా తెలియజేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం శాకాహార బోనాలే నిర్వహించాలనుకున్నా.. మాంసాహార ప్రచారం జరిగిందని మంత్రి వివరించారు. రాజకీయాల కోసం వివాదాలు సృష్టించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక ఈవో, వేద పండితులు కూడా శాకాహారాన్నే ధృవీకరించారన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. భవిష్యత్ కార్యాచరణపై సంప్రదింపులు జరుపుతామని మంత్రి చెప్పారు.
Read Entire Article