తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌ను కలుసుకున్నారు. ఈ భేటీలో విద్య, సాంకేతిక రంగాల్లో సహకారం, యూకే విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు అవకాశాలు విస్తరించేందుకు చర్చించారు. చెవెనింగ్ స్కాలర్‌షిప్‌ను కో-ఫండింగ్ విధానంలో తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు అంగీకారం వ్యక్తమైంది. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వడంలో బ్రిటన్ సహకరించనున్నట్లు తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీ వంటి రంగాల్లో పెట్టుబడులకు బ్రిటిష్ కంపెనీలు ముందుకు రావాలని సీఎం కోరగా, సానుకూల స్పందన లభించింది.