ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలోనూ నిత్యాన్నదాన పథకం అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయమై టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల తరహాలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలోనూ అన్నదానం పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ ఈవో.. ప్రస్తుతానికి జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి ఆగస్ట్ నుంచి నిత్యాన్నదానం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.