భగవద్గీత మీద ఒట్టు.. గోవులన్నీ అర్థ ఆకలితో చనిపోతున్నాయి..

6 days ago 4
తిరుపతి తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు చనిపోయాంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేయటంతో పాటుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై టీటీడీ కూడా స్పందించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ అంశం గురించి ప్రస్తావించారు. టీటీడీ ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రచారం చేస్తున్న అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరం అన్నారు. దీనిపై భగవద్గీత పై ప్రమాణం చేసి చెప్తున్నా.. టీటీడీ గోశాలలో అర్ధ ఆకలితో అలమటించి గోవులు చనిపోతున్నాయి.. ఇది అసత్యం అంటూ టీటీడీ ప్రచారం చేస్తోంది.. నిజాలు చెప్పాలనే నేను ప్రమాణం చేస్తున్నా అని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శివకుమార్ పేర్కొన్నారు. గోశాలలో గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు.
Read Entire Article