భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బతో నలుగురి మృతి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

2 months ago 20
తెలంగాణలో సూర్యుడు సుర్రుముంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తుండగా.. తీవ్ర వడగాలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం నిజామాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Read Entire Article