కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేస్తే భద్రాచలం సహా 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఇంజినీర్లు, ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించాయని తెలిపారు. బ్యారేజీల నిర్మాణ లోపాల వల్లే పంపింగ్ సాధ్యం కావడం లేదని చెప్పారు. రైతుల కోసం కాకుండా కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించిందని ఆరోపిస్తూ, కాళేశ్వరం వైఫల్యానికి గత ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు.