భద్రచాలం రామయ్య భక్తులకు ఆలయ ఈవో గుడ్‌న్యూస్ చెప్పారు. కల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సెక్టార్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. ఏప్రిల్ 6న స్వామి వారి కల్యాణం జరగనుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.