ఔనూ.. వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు అంతా బాగానే సాగింది. ఆ తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణలు వచ్చాయి. అవి కాస్త పెద్దవి కావటంతో.. భర్తపై భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కేసు విషయంలో భర్త తన లాయర్‌తో మాట్లాడేందుకు వెళ్లగా.. అక్కడ తన భార్య ఊహాతీయ చర్యలు తెలుసుకుని హతాశుడయ్యాడు. తాను బతికుండగానే.. చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి.. తన పేరు మీదున్న స్థలాన్ని అమ్ముకుంది ఆ భార్యామణి..!