భవన నిర్మాణ అనుమతికి లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

1 hour ago 1
హైదరాబాద్ నగరంలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. సంతోష్‌నగర్ సర్కిల్‌కు చెందిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ప్రభావతి రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా.. ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని ఆమెను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
Read Entire Article