మదనపల్లెకు చెందిన మూడేళ్ల చిన్నారి అనంత దక్షత్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల వయసులో 79 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ పూర్తి చేసి రికార్డులకు ఎక్కాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఈ దూరాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం. మదనపల్లె నుంచి కదిరికి 12న్నర గంటల సేపు స్కేటింగ్ చేసి చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. అతనికి స్వాగతం పలికారు.