తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు పారదర్శకంగా.. వేగంగా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే కొత్త కార్యక్రమానికి అడుగులు వేస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానుంది. దీనిని మొదట పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు.. నిషేధిత జాబితాలో గజం స్థలం రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.