తెలంగాణ ప్రభుత్వం హీట్‌వేవ్ , సన్ స్ట్రోక్‌లను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన వారికి ఎస్‌డీఆర్ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) కింద అపద్బంధు పేరుతో రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పరిహారం రూ. 50,000 మాత్రమే ఉండేది. రాబోయే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.