తిరుమల శ్రీవారిని శనివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సుహాస్, రోషన్ కనకాల, హర్ష చెముడు, సింగర్ స్మితలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సినీనటులతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.