తెలంగాణ ప్రభుత్వం మెరుగైన భూ పరిపాలన కోసం భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ముందుగా నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపడుతోంది. భూ రికార్డుల తయారీ, మార్పులు, నిర్వహణ ఈ చట్టం కింద జరుగుతాయి. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లో సమస్య పరిష్కారం.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, వారసత్వ భూముల హక్కులు, మ్యుటేషన్‌కు 30 రోజుల గడువు.. భూదార్ కార్డుల జారీ, కొత్త పాసుపుస్తకాల జారీ వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అప్పీళ్లు , రివిజన్‌కు కూడా అవకాశం ఉంది. పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుంది.