అలిపిరి ఓల్డ్ చెక్ పోస్ట్ విగ్రహం వివాదంలో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో భూమన వ్యా్ఖ్యలపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు.