భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. జూలై 5 లేదా 8, అలాగే ఆగస్ట్ 17 లేదా 19వ తేదీలలో ఒకరోజు ప్రారంభోత్సవానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రావాలని.. ఈ నాలుగు తేదీలలో వీలైన ఒకరోజును కేటాయించాలని ప్రధానిని కోరినట్లు తెలిసింది. మరోవైపు పనులను కూడా జూన్ 30 కల్లా పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.