మంచి ఆలోచన చేసిన జీహెచ్ఎంసీ.. వినూత్న రీతిలో ఫుట్‌పాత్ నిర్మాణం.. ఆ ప్రదేశంలో రూ.1.68 కోట్లతో..

3 months ago 4
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article