Mantralayam Math Donated Rs 25 Lakhs To Army: దేశ రక్షణ కోసం సైనికులకు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం అండగా నిలిచింది. దేశ రక్షణ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సరిహద్దుల్లో సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కర్ణాటక వాసుల కుటుంబాలకు లక్ష రూపాయల సాయం అందించారు. ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన మురళీనాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించి, 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.