ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల కొత్త స్థలాలు కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వం పట్టణాలకు 20 కిలోమీటర్ల దూరంగా స్థలాలు కేటాయించదని విమర్శించారు. అలానే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌ను రద్దు చేసిందని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న భూముల కొనుగోళ్లపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.