తెలంగాణలోని కొన్ని గ్రామాలు మద్యపాన నిషేధం దిశగా కఠిన చర్యలు తీసుకున్నాయి. కామారెడ్డి జిల్లాలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు మద్యపానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా, తాగినా లక్ష రూపాయల జరిమానాతో పాటు ఏడు చెప్పు దెబ్బలు విధిస్తారు. మద్యపానం వల్ల యువత చెడిపోతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.