తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. 39 కంపెనీలు ఇప్పటికే నమోదు చేసుకోగా.. తాజాగా దరఖాస్తుల గడువును పెంచారు. మార్చి 15 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగిస్తున్నట్లు బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. కొత్త బ్రాండ్ల ప్రవేశం ద్వారా.. మార్కెట్లో పోటీ పెరగనుంది. గతంలో బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం, లిక్కర్ ధరలను యథావిధిగా ఉంచింది. అయితే కొత్త మద్యం మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో మరోసారి బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.