తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ. మార్కెట్‌లోకి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కొత్త కంపెనీల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో.. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 37 కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 15 విదేశీ బ్రాండ్లు కాదు.. మరో 15 దేశీయ బ్రాండ్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి కొత్త బీర్ల బ్రాండ్లుగా సమాచారం.