తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు అందరికీ అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఓ కండక్టర్ ఓ పురుష ప్రయాణికుడికి 'మహాలక్ష్మి టికెట్' జారీ చేసి రూ. 30 వసూలు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరుగుతోంది. ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం దుర్వినియోగానికి ఉదాహరణగా నిలిచింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తీవ్రంగా చర్చ నడుస్తోంది.