మద్యం ప్రియులకు చేదువార్త.. భారీగా పెరగనున్న లిక్కర్ ధరలు, పెంపు ఏంతంటే..!?

4 months ago 21
మందుబాబులకు కిక్కు దిగిపోయేలా షాకింగ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. మద్యం ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో లిక్కర్ కంపెనీల ఒత్తిడి మేరకు ధరల నిర్ధారణ కమిటీ వచ్చే వారం భేటీ కానుంది. సాధారణ బ్రాండ్లపై రూ.60, ప్రీమియం బ్రాండ్లపై రూ.100 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ఏడాదికి రూ.3 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల చివరి నాటికి కొత్త ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article