తెలంగాణలోని అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నిజం చేసేలా.. ఓఆర్ఆర్ సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ టౌన్‌షిప్‌లలో అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.