బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు, హీరోయిన్లు.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటారా? మీకు మరీ ఇంత కక్కుర్తి ఎందుకు? అంటూ సీరియస్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.