ఏపీలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ భద్రతపై వివాదం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా రామగిరి పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారీగా జనం రావడంతో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లారు. జగన్ భద్రతపై ఆందోళన ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. అయితే.. మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలు డబ్బులిచ్చి జనసమీకరణ చేశారని ఆరోపించారు.