వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.'నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది' అన్నారు.