Konda surekha Flexi Issue: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి.. అటు అక్కినేని నాగార్జున, ఇటు కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలను ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ.. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రేవూరి ఫొటోలు లేవంటూ మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పంచాయితీ చేశారు.