ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తారని.. టీఆర్‌పీ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు రాజ్యాధికారం కల్పించడం కోసమే తీన్మార్ మల్లన్న ప్రజల్లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ఇతర విషయాలన్నీ ఇప్పటికే ఖరారు అయ్యాయని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.