గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్‌లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రెండ్రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్తున్నట్లు ప్రచారం జరగ్గా.. తాజాగా మంత్రి జూపల్లి ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా ఇంటికెళ్లి బండ్లను బుజ్జగించారు. పార్టీ మారొద్దని కోరటంతో బండ్ల మెుత్తబడినట్లు తెలిసింది.