Telangana AP Sentiment: తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా.. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయటం చర్చగా మారింది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అగ్గి రాజేసింది. పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు శేరిలింగంపల్లి గాంధీకి కట్టబెట్టటం ఇప్పుడు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల దగ్గరి నుంచి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ వరకు వచ్చి ఆగాయి. తర్వాత ఏం జరుగనుందన్నది ఉత్కంఠగా మారింది.