గత నెలలో బర్డ్ ఫ్లూ తగ్గినా.. ఇప్పుడు ఉమ్మడి నల్గొండలో మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇటువైపు ఎవరూ రావద్దంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోళ్లకు మరోసారి బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు, చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.