అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నేడు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. అనంతరం అక్కడి ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి త్రివేణి సంగమం ఘాట్ వద్దకు వెళ్లి పుణ్య స్నానం ఆచరించారు. తెలంగాణ రాష్ట్రం అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని ఆయన ప్రార్థించారు. వేదపండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించారు.