మహాశివరాత్రి సందర్భంగా.. టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ప్రమఖు శైవక్షేత్రాలైన వేములవాడతో పాటు కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ లాంటి ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు.. హైదరాబాద్ నుంచి నగర చుట్టుపక్కల ఉన్న శైవక్షేత్రాలు వెళ్లే భక్తులకు 440 స్పెషల్ బస్సులను నడిపించనుండగా.. వేమలవాడకు 778 స్పెషల్ బస్సు సర్వీసులను నడిపించనున్నట్టు్ ప్రకటించారు.