బంగారం దొంగతనం కేసులో ఓ దళిత మహిళపై పోలీసులు ప్రవర్తించిన పాశవిక తీరుపై రాష్ట్రమంతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే.. సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బాధితురాలిని పరామర్శించారు. ఈ క్రమంలో.. ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు చేశారు.