తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రైస్‌మిల్లుల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో రైస్‌మిల్లులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించగా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థల పరిశీలన జరుగుతోంది. రూ. 2 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.