పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు ఒక పూట అన్నదానం కోసం తన కొడుకు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలు విరాళం ఇచ్చారు. రష్యాలో జన్మించిన ఆమె జన్మతః క్రిస్టియన్ అయినప్పటికీ గుండు చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మహిళలు దేవాలయాల దగ్గర తలనీలాలు సమర్పించడం సరికాదనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.