రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెద్దఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రాధాన్యం పెరిగిందన్న చంద్రబాబు.. మహిళల కోసం ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలం, నగరంలో ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేస్తామని.. వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.