తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల ఆదాయాన్ని పెంచడానికి, విద్యుత్ భారాన్ని తగ్గించడానికి పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఏటా లక్ష మంది సభ్యుల ఇళ్లపై వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్త్రీనిధి సమాఖ్య ద్వారా 4 శాతం వడ్డీ రాయితీతో రుణాలు అందిస్తారు. కేంద్రం రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. ఈ యూనిట్లు 25 ఏళ్లు పనిచేస్తాయి. ఐదేళ్లలో అప్పు తీరిన తర్వాత 20 ఏళ్లు విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయం పొందవచ్చు.