తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. వారికి తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తోంది. తాజాగా.. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు బీమా పథకానికి బదులుగా.. ప్రభుత్వమే నేరుగా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. గతేడాది మరణించిన 385 మందికి రూ. 38.5 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.