మాజీ సీఎం వైఎస్ఆర్ గురించి మాట్లాడుతూ విలేకర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్న ఘటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. అనంతపురం జిల్లాలో సీపీఐ పాదయాత్రలో పాల్గొన్న షర్మిల.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మను అవమానించినందుకు.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంతగా ఏడ్చినా తక్కువేనని అన్నారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనపై సెటైర్లు వేశారు షర్మిల.